![]() |
![]() |
.webp)
శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో ఫుల్ ఫన్నీగా ఉంది. ఈ ఎపిసోడ్ కి 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వి వచ్చాడు. ఇందులో ఇంద్ర మూవీ సీన్స్ స్పూఫ్ గా చేశారు. పదేళ్ల తరువాతా కాశీలో అనేసరికి ఆది చిరంజీవి గెటప్ లో వచ్చారు. "రేయ్ ఎవరో కాశీకి వస్తున్నారు కృష్ణ రామ అనుకుంటా " అని ఆది నాటీ నరేష్ తో అన్నాడు. అక్కడికి అందంగా నడుచుకుంటూ వచ్చిన రష్మీ ఆది మాట వినేసరికి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. తర్వాత ఆమె కోపం తీర్చడానికి "అంతగా నచ్చావమ్మో అనసూయమ్మో " అనే సాంగ్ పాడాడు. అంతే రష్మీ కి కోపం వచ్చేసింది. హే ఎలా అనుకుంటూ చిరాగ్గా మొహం పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెంటనే ఆదికి అర్ధమయ్యింది.
"రేయ్ రష్మిని పెట్టి అనసూయ అంటారేంట్రా " అన్నాడు. దాంతో అందరూ నవ్వేశారు. ఆల్రెడీ అనసూయ హోస్టింగ్ మానేసి చాలా ఏళ్ళే ఐపోయింది. జబర్దస్త్ లో అనసూయ తర్వాత రష్మీ వచ్చింది అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ షో కూడా చేస్తోంది. ఇక ఇప్పుడు అనసూయ మీద ఉన్న పాట వేసి రష్మిని హర్ట్ చేసాడు ఆది. ఇక రష్మీ ఇందులో మామిడికాయ పచ్చడి పట్టి అందరికీ రుచి చూపించింది. ఇక ఆది , పృద్వి , టేస్టీ తేజ వంటి వాళ్లంతా తిని వామ్మో అంటూ ఆపసోపాలు పడ్డారు.
![]() |
![]() |